Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Follow Udayam on Google
సందీప్ Jul 08, 2026 10:36 AM నిర్మల్ General
ఎల్ఓసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి - Udayam
దిలావర్‌పూర్ మండలం న్యూ లోలం గ్రామానికి చెందిన దేవర సారంగపాణి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్ఓసీ చెక్కును బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని అన్నారు. చెక్కు మంజూరు చేయించడంలో సహకరించిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...