Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుమ్మచేనుపల్లెలో ఏనుగుల బీభత్సం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 12:02 PM తిరుపతిGeneral
తుమ్మచేనుపల్లెలో ఏనుగుల బీభత్సం - Udayam
చిన్నగొట్టిగల్లు మండలం తుమ్మచేనుపల్లె గ్రామంలో రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రైతు భాను ప్రకాశ్‌రెడ్డి సాగు చేసిన టమాటా పంటలోకి ప్రవేశించి తొక్కి ధ్వంసం చేశాయి. దీంతో సుమారు రూ.50 వేల నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగుల సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి పంట నష్టానికి పరిహారం అందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...