Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ నివారణకు అంజన్న ఆలయంలో – వరుణ యాగం

Follow Udayam on Google
nerella Srinivas Jul 21, 2026 1:54 PM జగిత్యాలబ్రేకింగ్ న్యూస్
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ నివారణకు అంజన్న ఆలయంలో – వరుణ యాగం - Udayam
ఎల్ నినో వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి, సమృద్ధిగా వర్షాలు కురవాలని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు వరుణ జపం, వరుణ యాగం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి విశేష అభిషేకం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సకాలంలో వర్షాలు పడి పంటలు పండాలని కోరుతూ ఈ కార్యక్రామాన్ని ఈఓ అంజనారెడ్డి, ఆలయ అర్చకులు, పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపారు.

Comments

G
Loading comments...