వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ విమానయాన సంస్థలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర లీటరుకు రూ.16 పెరిగి రూ.137కి చేరింది. ఆగస్టు, సెప్టెంబరు పెంపుల తర్వాత మరోసారి ధరలు పెరిగాయి. విమాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఇంధనానికి 35-40% వరకు వాటా ఉంటుంది.
ఏటీఎఫ్ ధరల పెరుగుదలతో విమాన సంస్థలపై వ్యయభారం పెరగొచ్చని నిపుణులు తెలిపారు. ఈ భారాన్ని కొంతమేర ప్రయాణికులపై అధిక ఛార్జీలు రూపంలో మోపే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

