Udayam Digital
Menu

ఏపీలో ప్రజాస్వామ్యంపై దాడులు!

Shruthi Nov 21, 2026 7:06 AM అమరావతిGeneral
ఏపీలో ప్రజాస్వామ్యంపై దాడులు! - Udayam Digital
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న దాడులు, దౌర్జన్యాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై దాడి యత్నం, తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి ఘటనలు కలకలం రేపాయి. ఈ పరిణామాలపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సహా పలువురు జాతీయ స్థాయి నేతలు, జర్నలిస్టులు స్పందించారు. ఏపీలో చట్టబద్ధ పాలన ఉందా అంటూ ప్రశ్నించారు.

Comments

G
Loading comments...