వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ 5,261 ప్రత్యేక బస్సులను నడపనుంది. సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఈ నెల 16 నుంచి 19 వరకు 3,207 బస్సులు, తిరిగి వచ్చే వారి కోసం 20 నుంచి 25 వరకు 2,054 బస్సులు నడపనున్నారు.
హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నారు. దసరా ఉత్సవాలు ఈ నెల 11 నుంచి 20 వరకు జరగనున్నాయి.
Comments
Loading comments...

