Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 3.71 లక్షల PMAY ఇళ్లు రద్దు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 10:22 AM అమరావతిGeneral
ఏపీలో 3.71 లక్షల PMAY ఇళ్లు రద్దు - Udayam
ఏపీలో PMAY-అర్బన్ 1.0 కింద 2024కి ముందు మంజూరై నిర్మాణాలు ప్రారంభించని 3.71 లక్షల ఇళ్లను కేంద్రం రద్దు చేసింది. పథకం గడువు 2024 డిసెంబర్‌తో ముగిసినా రెండుసార్లు పొడిగించారు. 2026 జులై నాటికీ పనులు ప్రారంభించకపోవడంతో ఇళ్లను రద్దు చేశారు. జియో ట్యాగింగ్ పూర్తైన 1.27 లక్షల ఇళ్లను పునరుద్ధరించాలని, మిగతావాటిని PMAY-2.0లోకి మార్చాలని ఏపీ కోరింది.

Comments

G
Loading comments...