Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీసీ లాభాల్లో 61.6 శాతం కోత

Follow Udayam on Google
రూప దేవి Jul 24, 2026 6:15 PM జాతీయంబిజినెస్
ఏసీసీ లాభాల్లో 61.6 శాతం కోత - Udayam
ఇంధన, రవాణా ఖర్చులు పెరగడంతో అదానీ గ్రూప్‌నకు చెందిన 'ఏసీసీ' సిమెంట్స్ జూన్ త్రైమాసికంలో తీవ్ర నిరాశాజనక ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ నికర లాభం 61.6% తగ్గి రూ. 148 కోట్లకు పరిమితమవ్వగా, ఆదాయం కూడా 8.1% క్షీణించింది. పెట్‌కోక్, బొగ్గు, డీజిల్ ధరలు పెరగడం మరియు ప్లాంట్ల మరమ్మతుల వల్ల ఈ త్రైమాసికంలో లాభాలపై ప్రతికూల ప్రభావం పడిందని కంపెనీ తెలిపింది.

Comments

G
Loading comments...