Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్లలో జనసేనాని జన్మదినోత్సవ మహా బైక్ ర్యాలీ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 9:24 PM శ్రీకాకుళంGeneral
ఎచ్చెర్లలో జనసేనాని జన్మదినోత్సవ మహా బైక్ ర్యాలీ - Udayam
​జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈనెల 2న ఎచ్చెర్ల నియోజకవర్గంలో మహా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ డా. విశ్వక్సేన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజున ఉదయం 8:30లకు లావేరు పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ సుభద్రాపురం, రణస్థలం మీదుగా పైడి భీమవరం వరకు సాగి తిరిగి 11 గంటలకు లావేరు చేరుకుంటుంది. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీగా తరలిరావాలని కోరారు.

Comments

G
Loading comments...