వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయశాఖ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు.
దసరా సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

