Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాలోపు పీఆర్సీ ప్రకటించాలి: మహ్మద్ సాధిఖ్

Follow Udayam on Google
Sreekanth Patel Sep 27, 2026 12:10 PM మహబూబ్‌నగర్తెలంగాణ
దసరాలోపు పీఆర్సీ ప్రకటించాలి: మహ్మద్ సాధిఖ్ - Udayam
ప్రభుత్వ ఉద్యోగులకు దసరా లోపు కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ప్రకటించాలని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ డిమాండ్ చేశారు. ఈ నెల 30తో పీఆర్సీ గడువు ముగియనున్నందున ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, బకాయి డీఏలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...