Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాకు ముందే కొత్త పెన్షన్లు

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 22, 2026 3:48 PM రంగారెడ్డిGeneral
దసరాకు ముందే కొత్త పెన్షన్లు - Udayam
అక్టోబర్‌లో కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. దసరా పండుగకు ముందే అర్హులకు పెన్షన్లు అందేలా క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు ఆదేశించారు. ఒంటరి మహిళలు, వితంతువులు సహా అర్హులందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...