వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కొత్తగా 2.25 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దసరా నాటికి అర్హులైన వారికి కొత్త పింఛన్లు అందేలా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. ముఖ్యంగా దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర అర్హులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
Comments
Loading comments...

