వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాల సీజన్ మొదలై నెల రోజులు గడిచినా అనంత, శ్రీసత్యసాయి జిల్లాల జీవనాధారమైన తుంగభద్ర, శ్రీశైలం జలాశయాల్లోకి చుక్క వరద నీరు చేరకపోవడంతో హెచ్చెల్సీ, హంద్రీనీవా కాలువల ప్రవాహాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి తీవ్ర గడ్డు పరిస్థితి ఏర్పడటంతో రైతాంగంలో తీవ్ర నైరాశ్యం ఆవరించింది.
నీటి కొరత కారణంగా వరిసాగుపై ఆశలు ఆవిరవడమే కాకుండా, కనీసం ఆరుతడి పంటలు వేసేందుకు కూడా ఆయకట్టు దారులు ధైర్యం చేయలేకపోతున్నారు. అరకొరగా వచ్చే నీరు తాగునీటికే సరిపోయేలా లేకపోవడంతో, ఈ ఏడాది రెండు జిల్లాలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పవని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

