వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో షేక్ హబీబ్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి ఏడు రోజుల జైలు శిక్ష విధించారు.
నిందితుడిని నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

