Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌కు భారీ డ్రగ్స్ స్మగ్లింగ్

రమేష్ బాబు Jul 10, 2026 9:28 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
భారత్‌కు భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ - Udayam Digital
అమెరికా నుంచి భారత్‌కు విమాన మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 22 కేజీల కొకైన్‌ను అమెరికా పోలీసులు పట్టుకున్నారు. మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గో వేర్‌హౌజ్‌లో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఈ డ్రగ్స్ రవాణాను సీజ్ చేశారు. 'ఆపరేషన్ స్ట్రయికర్' పేరుతో జరిపిన ఈ దాడిలో 8 ప్యాకెట్లు, నాలుగు బ్రిక్స్ రూపంలో ఉన్న వైట్ పౌడర్‌ను స్వాధీనం చేసుకుని, అది కొకైన్ హైడ్రోక్లోరైడ్‌గా అధికారులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...