వార్తలకు తిరిగి వెళ్లండి
విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్: త్రుటిలో తప్పిన ప్రమాదం

న్యూయార్క్‌లో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న జెట్ బ్లూ విమానాన్ని డ్రోన్ ఢీకొట్టింది. 159 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానం 3 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టింది. విమానాశ్రయాల సమీపంలో డ్రోన్ల వినియోగంపై అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...