Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ క్యాన్సర్‌ ఔషధం

Follow Udayam on Google
Jay Jun 14, 2026 2:18 PM జాతీయంబిజినెస్
అమెరికా మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ క్యాన్సర్‌ ఔషధం - Udayam
క్యాన్సర్ చికిత్సలో వినియోగించే జనరిక్ ఔషధం ‘బొసుటినిబ్‌’ను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అమెరికా మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌ భాగస్వామ్యంతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒప్పందం ప్రకారం.. మందు తయారీ, అభివృద్ధి బాధ్యతలను ఎంఎస్‌ఎన్ చూసుకోనుండగా, అమెరికాలో విక్రయించే పూర్తి హక్కులు డాక్టర్ రెడ్డీస్ దక్కించుకుంది. 400 ఎంజీ సామర్థ్యమున్న ఈ మాత్రలపై డాక్టర్ రెడ్డీస్‌కు 180 రోజులపాటు ప్రత్యేక విక్రయ హక్కులు లభించాయి.

Comments

G
Loading comments...