వార్తలకు తిరిగి వెళ్లండి

దోమేడ గ్రామ పంచాయతీలో గురువారం ప్రత్యేక సమగ్ర సవరణ సర్పై పంచాయతీ కార్యదర్శి రాంబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఓటరు జాబితాలోని పేర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ కొత్త ఓటరుగా నమోదు చేయడం, అర్హత లేని ఓటర్ల వివరాలను సేకరించడంపై దృష్టి పెట్టారు. ముసాయిదా ఓటరు జాబితాను గ్రామస్తుల సమక్షంలో పరిశీలించి పలు కీలక అంశాలపై చర్చించారు.
Comments
Loading comments...

