వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందని, గతంలో తాను కూడా తమిళనాడులో ప్రచారం చేశానని గుర్తుచేశారు.
తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని, ప్రజలకు సేవ చేయడంలోనే పోటీ ఉండాలని ఆయన అన్నారు. విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా ప్రాంతాల మధ్య అనవసర విద్వేషాలు రేపడం మంచిది కాదని, వ్యవస్థను లాజికల్‌గా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
Comments
Loading comments...

