Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగుర్గావ్ సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
md jabeer Aug 24, 2026 10:18 PM నిర్మల్General
దొంగుర్గావ్ సిద్దేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే - Udayam
నర్సాపూర్ (జి) మండలం దొంగుర్గావ్ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ సిద్దేశ్వర ఆలయంలో సోమవారం ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదోక్తంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...