వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్మాత దుర్గమ్మ అలంకరణ నిమిత్తం రూ.11 లక్షల విలువైన బంగారు జడను దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) కుటుంబం ఆదివారం విరాళంగా అందజేసింది. లక్ష్మీదేవి, ఇతర దైవిక రూపాలతో పాటు ఆకుపచ్చ రంగు విలువైన రాళ్లు, ముత్యాలతో జడను అలంకరించారు.
మరో 15 రోజుల్లో రూ.75 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని విరాళంగా అందించనున్నట్లు ఛైర్మన్ తెలిపారు.
Comments
Loading comments...

