Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్‌లో తగ్గిన దేశీయ విమాన ప్రయాణికులు

సంజయ్ రెడ్డి Jul 22, 2026 12:57 PM అల్ ఇండియా in about 3 hours
జూన్‌లో తగ్గిన దేశీయ విమాన ప్రయాణికులు - Udayam Digital
ఈ ఏడాది జూన్‌లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.35 కోట్లకు తగ్గిందని డీజీసీఏ తెలిపింది. మే నెలలోని 1.53 కోట్లతో పోలిస్తే ఇది 11.76% తక్కువ. వర్షాలు, బడులు తెరుచుకోవడంతో ఈ 'లీన్ పీరియడ్'లో ప్రయాణాలు తగ్గుతాయి. మార్కెట్ వాటాలో 66.3%తో ఇండిగో అగ్రస్థానంలో నిలవగా, ఎయిరిండియా వాటా 23.6 శాతానికి తగ్గింది. ఇక సమయపాలన (OTP) విభాగంలోనూ 89.4%తో ఇండిగోనే మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

Comments

G
Loading comments...