Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుక్క అడ్డొచ్చి బైక్ ప్రమాదం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 10, 2026 3:22 PM ఏలూరుGeneral
కుక్క అడ్డొచ్చి బైక్ ప్రమాదం - Udayam
రోడ్డుపై కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన ఘటనలో తాత, మనవరాలు గాయపడ్డారు. పెంటపాడుకు చెందిన సింహాద్రి మోహనా చారి, మనవరాలు గిరిజ వర్షిత ఏలూరు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఒక్కసారిగా శునకం అడ్డురావడంతో వీరు కిందపడిపోయారు. గాయపడిన ఇరువురిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...