Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబు కేబినెట్ భేటీకి మంత్రుల డుమ్మా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 10, 2026 2:16 PM అమరావతిGeneral
చంద్రబాబు కేబినెట్ భేటీకి మంత్రుల డుమ్మా - Udayam
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి పలువురు కీలక మంత్రులు గైర్హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో రాకపోగా, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ విదేశీ పర్యటనల కారణంగా హాజరుకాలేదు. మంత్రి నిమ్మల రామానాయుడు వ్యక్తిగత కారణాలతో, కొండపల్లి శ్రీనివాస్ ప్రొటోకాల్ విధుల్లో ఉండటంతో రాలేకపోయారు. వీరితో పాటు మరో ఇద్దరు మంత్రులు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...