Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సామాన్యులను తిప్పకండి: నిర్మలా సీతారామన్ హితబోధ

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 27, 2026 11:42 AM జాతీయంGeneral
సామాన్యులను తిప్పకండి: నిర్మలా సీతారామన్ హితబోధ - Udayam
ఆదాయపు పన్ను శాఖ అధికారులు సామాన్యుల ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రతి చిన్న పనికి వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హితబోధ చేశారు. ముంబయిలో 'ఆయ్‌కార్‌ సింధు' భవనాన్ని ప్రారంభించిన ఆమె.. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలకే అనుమతుల్లో ఇబ్బందులు ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.

Comments

G
Loading comments...