వార్తలకు తిరిగి వెళ్లండి
రామాలయం విరాళాల చోరీని రాజకీయం చేయొద్దు: సుప్రీంకోర్టు

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసు విచారణ సందర్భంగా ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టులు రాజకీయ వేదికలు కాదని, కేవలం నేరపూరిత అంశంగానే దర్యాప్తు చూస్తామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసి 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌జీ మెహతా కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది.
Comments
Loading comments...