వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. బుధవారం ఆయన దండేపల్లి మండలంలోని గూడెం, ద్వారక, కర్ణంపేట గ్రామాలలో పర్యటించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రమాదాలు జరగకుండా అందరూ కలిసి పని చేయాలన్నారు. అనంతరం ఆయా గ్రామాలలో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలను కూడా కలెక్టర్ పర్యవేక్షించి సూచనలు చేశారు.
Comments
Loading comments...

