Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎల్‌కు నంబర్ లింక్.. వదంతులు నమ్మొద్దు

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 7:39 AM హైదరాబాద్General
డీఎల్‌కు నంబర్ లింక్.. వదంతులు నమ్మొద్దు - Udayam
డ్రైవింగ్ లైసెన్స్‌కు ఫోన్ నంబరు లింక్ చేయకపోతే రద్దవుతాయంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మవద్దని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. లైసెన్స్ రద్దయ్యే ప్రసక్తే లేదని స్పష్టతనిచ్చారు. సారథి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా మొబైల్ నంబరు అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు. ఆన్‌లైన్ శోధనలో వివరాలు కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...