Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్ 1న సీఎంగా డీకే ప్రమాణస్వీకారం

Follow Udayam on Google
Sonal Mehrotra Kapoor May 29, 2026 2:55 PM జాతీయంGeneral
జూన్ 1న సీఎంగా డీకే ప్రమాణస్వీకారం - Udayam
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ జూన్ 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య రాజీనామాతో ఈ నాయకత్వ మార్పు ఖాయమైంది. శనివారం జరిగే సీఎల్‌పీ సమావేశంలో డీకే శివకుమార్‌ను అధికారికంగా శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ఈ మార్పు నేపథ్యంలో తన కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర సిద్ధరామయ్యకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య అధిష్ఠానాన్ని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు సిద్ధరామయ్య ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతారు.

Comments

G
Loading comments...