Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్ఠు రోగులకు ప్రత్యేక చెప్పుల పంపిణీ

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 30, 2026 4:57 PM బాపట్లGeneral
కుష్ఠు రోగులకు ప్రత్యేక చెప్పుల పంపిణీ - Udayam
బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అంగవైకల్యమున్న కుష్ఠు రోగులకు మైక్రో సెల్యులర్ రబ్బర్‌తో తయారైన ప్రత్యేక చెప్పులను పంపిణీ చేశారు. రోగుల పాదాల సంరక్షణ, సౌకర్యం కోసం ఈ చెప్పులను అందజేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. విజయమ్మ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, టీబీ అధికారి డాక్టర్ వి. సోమ్లా నాయక్, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదిక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...