Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాసాశ్రమ పాలనపై వివాదం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 31, 2026 2:21 PM తిరుపతిGeneral
వ్యాసాశ్రమ పాలనపై వివాదం - Udayam
శ్రీ సద్గురు మలయాళస్వామి స్థాపించిన పవిత్ర వ్యాసాశ్రమం పీఠాధిపతి తీరు, సాధువేతర పాలన వల్ల వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆశ్రమ ప్రతిష్ఠ మసకబారుతుండటంతో పరిరక్షణ కమిటీ భగ్గుమంటుంది. 18 ఏళ్ల కిందట పరిపూర్ణానందగిరిస్వామి బాధ్యతలు చేపట్టాక కంటి ఆసుపత్రి, వేదపాఠశాల, అనాథాశ్రమం మూతపడ్డాయి. సాధువులు కనుమరుగై, భక్తుల ప్రవేశం నిలిచిపోవడంతో పాలన గాడితప్పిందని భక్తులు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...