వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడంగల్‌లో జరిగిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.
భాజపా పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాలు అమ్ముకుంటున్నారని, కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో దీనిపై చర్చకు అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు.
Comments
Loading comments...

