వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా సంఘాల సమావేశాల్లో పొదుపులతోపాటు సామాజిక సమస్యలపై చర్చించాలని ఏపీడీ జయశ్రీ సూచించారు. ఖమ్మంలో వీవోఏలు, ఓబీలకు మహిళల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు.
ప్రజ్వల ఎన్జీవో, సెర్ప్ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించడం ద్వారానే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

