Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిలావర్పూర్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. రెండు ఇళ్లలో చోరీ

Follow Udayam on Google
సందీప్ Jul 15, 2026 10:04 AM నిర్మల్ General
దిలావర్పూర్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. రెండు ఇళ్లలో చోరీ - Udayam
దిలావర్పూర్ మండల కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడి మొత్తం రూ.80 వేల నగదు, తులం బంగారాన్ని అపహరించారు. గౌరీ చిన్న పోశెట్టి ఇంట్లో రూ.50 వేల నగదు, తులం బంగారం చోరీ చేయగా, పల్దె ముత్యం ఇంట్లో రూ.30 వేల నగదు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న ఎస్సై రవీందర్ వివరాలు సేకరించారు. ముగ్గురు దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

Comments

G
Loading comments...