వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్ మండలంలోని అల్లాపూర్, నాగసమందర్, రుద్రారం, గడ్డమిది గంగారాం తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది.
భారీ వర్షంతో ప్రధాన రహదారులు, వీధులు జలమయమై ప్రయాణికులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

