Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాల్సిందే

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 05, 2026 5:04 PM నిజామాబాద్General
ధర్పల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికులకు పెన్షన్‌ ఇవ్వాల్సిందే - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలో బీడీ కార్మికుల పెన్షన్‌కు విధించిన కటాఫ్‌ డేట్‌ను వెంటనే తొలగించి, అర్హులైన ప్రతి బీడీ కార్మికుడికి చేయూత పెన్షన్‌ అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌. రమేష్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం అంగడి బజార్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

Comments

G
Loading comments...