వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టణంలోని పీ.ఆర్.టీ సర్కిల్ వద్ద వన్‌టౌన్ పోలీసులు ఆదివారం విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు.
వన్‌టౌన్ జమీందార్ వెంకట రాముడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ సమయంలో మొబైల్‌ఫోన్ వినియోగం, మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 15 వాహనాలకు చలానాలు విధించారు.
Comments
Loading comments...

