Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మారం రోడ్డుపై వ్యర్థాల కుప్పలు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:39 AM పెద్దపల్లి General
ధర్మారం రోడ్డుపై వ్యర్థాల కుప్పలు - Udayam
నంది మేడారం నుంచి ధర్మారం వెళ్లే ప్రధాన రహదారి వెంట వ్యర్థాలను ఇష్టారీతిన పడేస్తున్నారు. మేడారం పెట్రోల్ బంక్ నుంచి ఎస్సారెస్పీ కెనాల్ వరకు రోడ్డుకు ఇరువైపులా ప్లాస్టిక్, వైద్య వ్యర్థాలు, అట్టముక్కలు పేరుకుపోయాయి. దీంతో దుర్వాసన వెదజల్లుతూ అపరిశుభ్రత నెలకొందని ప్రయాణికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వ్యర్థాలను తొలగించి, మళ్లీ చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...