వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ధర్మాజీపేటలో జీయర్ స్వామి సప్తతి తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీరామ హృదయ కలశ యాత్రను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామ నామస్మరణతో యాత్ర కొనసాగించారు.
ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రపంచ శాంతి, లోకకల్యాణం, గ్రామ సుభిక్షం కోసం యాత్ర నిర్వహించినట్లు వికాస తరంగిణి బాధ్యులు వేల్పుల స్వామి తెలిపారు.
Comments
Loading comments...

