వార్తలకు తిరిగి వెళ్లండి

బోయకొండ శక్తి క్షేత్రానికి ఆషాఢ ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో దర్శనం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. వీఐపీ దర్శనాలు రద్దు చేస్తామని చెప్పినా ప్రత్యేక దర్శనాలు కొనసాగడంతో సాధారణ భక్తులు క్యూలో వేచి ఉన్నారు.
భారీగా వాహనాలు రావడంతో రాకపోకలు స్తంభించాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ముందస్తు ఏర్పాట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

