వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అర్చకులు వేదమంత్రాల నడుమ గణపతి పూజ, స్వస్తివాచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

