వార్తలకు తిరిగి వెళ్లండి
రూ. 14 కోట్లతో 7 నగరవనాల అభివృద్ధి

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు రూ. 14 కోట్లతో 7 నగరవనాలను అభివృద్ధి చేస్తున్నట్లు డీఎఫ్‌వో తమ్మినేని చక్రపాణి తెలిపారు. 2026-27లో 350 హెక్టార్లలో 5 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
అలాగే వన్యప్రాణుల రక్షణకు ప్రత్యేక వాహనాలు అందుబాటులోకి తెచ్చామని, అటవీ ఉల్లంఘనులపై కేసులు నమోదు చేసి రూ. 2.38 కోట్ల అపరాధ రుసుం వసూలు చేశామని వెల్లడించారు.
Comments
Loading comments...