Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నదీపాయల్లో ఇసుక దందా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 11, 2026 12:51 PM తూర్పుగోదావరి General
నదీపాయల్లో ఇసుక దందా - Udayam
వై.వి.పాలెం ఏటిగట్టు దిగువన లంకలగన్నవరం లంక భూముల్లో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో వందలాది టిప్పర్లలో నాణ్యమైన ఇసుకను పొరుగు జిల్లాలకు తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. వరద నీరు రాకపోవడాన్ని ఆసరాగా చేసుకుని నదిలో బాటలు వేసి తవ్వకాలు జరుపుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ దందాను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...