Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలూరు చెరువులో అక్రమ నిర్మాణాలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 11, 2026 1:01 PM కర్నూలుGeneral
ఆలూరు చెరువులో అక్రమ నిర్మాణాలు - Udayam
ఆలూరులో కోట్ల విలువైన చెరువు స్థలం అక్రమార్కుల కబ్జాకు గురవుతోంది. బళ్లారి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 155 ఎకరాల తటాకంలో నీరు లేకపోవడంతో నేతల అండదండలతో పక్కా భవనాలు, నర్సరీలు, ఆలయాలు నిర్మించేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 ఎకరాల వరకు ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోంది. వేసవి నీటి ఎద్దడి తీర్చేందుకు ఈ చెరువును హెచ్.ఎన్.ఎస్.ఎస్ కాలువ ద్వారా నింపే అవకాశం ఉన్నా.. అధికారులు ఆక్రమణలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...