Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ భవనాలకు మహర్దశ

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 11, 2026 12:57 PM పశ్చిమగోదావరి General
అంగన్‌వాడీ భవనాలకు మహర్దశ - Udayam
జిల్లాలో ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సొంత భవనాలు లేక ఇరుకు గదులు, అద్దె ఇళ్లలోనే నడుస్తున్న కేంద్రాలకు ఈ నిర్ణయంతో ఉపశమనం లభించనుంది. జిల్లా వ్యాప్తంగా నిలిచిపోయిన 83 భవనాలను ఒక్కోదానికి రూ.12 లక్షల చొప్పున వెచ్చించి పూర్తి చేయనున్నారు. అంతేకాకుండా మూతపడిన పాఠశాల భవనాలను కూడా అంగన్‌వాడీ కేంద్రాలకు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Comments

G
Loading comments...