వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దుంకుడు మోరి తండా ప్రాథమిక పాఠశాలను డీఈఓ మల్లికార్జున్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలతో పాటు విద్యార్థుల హాజరును ఆయన పరిశీలించారు.
సమయపాలన పాటించాలని ఉపాధ్యాయులను ఆదేశించిన ఆయన, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీశారు. ఐదేళ్లు దాటిన పిల్లలందరినీ బడిలో చేర్పించేలా కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

