వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా వేద పండితులు డీఈవో రాజుకు ఏడుపాయల ఆలయ ప్రశస్తిని వివరించారు. ఆయన వెంట అక్షయ పాత్ర ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి, పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

