Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోధనా సామర్థ్యాలను పరిశీలించిన డీఈవో

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 14, 2026 5:26 PM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
బోధనా సామర్థ్యాలను పరిశీలించిన డీఈవో - Udayam
గద్వాల మండలం కురువపల్లి, కాకులారం పాఠశాలలను డీఈవో కె.విజయలక్ష్మి శుక్రవారం సందర్శించారు. కురువపల్లి పాఠశాలలో 5, 6వ తరగతి విద్యార్థుల హిందీ, గణిత సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. కాకులారం పాఠశాలలో 9వ తరగతి విద్యార్థుల బోధనా సామర్థ్యాలను పరిశీలించి, వారితో పాఠాలు చదివించారు. విద్యార్థుల స్పందనలు మెరుగ్గా ఉన్నాయని డీఈవో తెలిపారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...