Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో డెల్టా సాగుకు నీటి ఆందోళన

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 27, 2026 12:32 PM పశ్చిమగోదావరి General
వర్షాభావంతో డెల్టా సాగుకు నీటి ఆందోళన - Udayam
వర్షాభావం, గోదావరిలో తగ్గిన నీటి ప్రవాహంతో డెల్టా రైతుల్లో ఆందోళన నెలకొంది. ఖరీఫ్‌లో దాదాపు వరినాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని సూచించారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ సాగునీటిని అందిస్తామని అధికారులు తెలిపారు. ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే వర్షపాతం 63 మిల్లీమీటర్లు తక్కువగా నమోదైంది.

Comments

G
Loading comments...